కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యే ఒక రోజు హోటల్ ఖర్చెంతో తెలుసా?

  • నోవాటెల్‌లో జేడీఎస్ ఎమ్మెల్యుల బస
  • తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
  • కాంగ్రెస్ క్యాంపునకు ఇన్‌చార్జిగా మధుయాష్కీ
కర్ణాటక రాజకీయం పలు మలుపులు తిరిగి చివరికి హైదరాబాద్ చేరుకుంది. నేడు అసెంబ్లీలో బలనిరూపణ ఉండడంతో కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్‌లోని హోటళ్లకు తరలించాయి. నోవాటెల్‌లో జేడీఎస్, తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేశారు.

జేడీఎస్ ఎమ్మెల్యేలు నోవాటెల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బస చేసినందుకు గాను 19 లక్షల రూపాయల బిల్లు కాగా, జేడీఎస్ ప్రతినిధులు దానిని చెల్లించారు. ఇక తాజ్‌కృష్ణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉదయం నుంచి సాయంత్రం వరకు గడిపినందుకు గాను 26 లక్షల రూపాయల బిల్లు అయినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ క్యాంపునకు మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. 
Go Back to Shorts
Karnataka
Hyderabad
Congress
JDS

More Telugu News